Maoist Party: ములుగు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-05 15:50:17  IST  )

ములుగు(Mulugu) జిల్లా ఏటూరునాగారం మండ‌లం చెల్పాక ఎన్‌కౌంట‌ర్‌పై భారత కమ్యూనిస్టు పార్టీ(Maoist Party) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది.

Maoist Party: ములుగు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు(Mulugu) జిల్లా ఏటూరునాగారం మండ‌లం చెల్పాక ఎన్‌కౌంట‌ర్‌పై భారత కమ్యూనిస్టు పార్టీ(Maoist Party) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. ‘నమ్మక ద్రోహి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకే ఏటూరు నాగారంలో తమ సహచరులు అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. పోలీసులకు అప్రూవర్‌గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహం కోల్పోయే లాగా చేశారు. స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్‌ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు కాల్చి చంపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నాం. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాము’ అని అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు.




Next Story