- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: మంత్రి సీతక్కపై మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖ
మంత్రి సీతక్క విషయంలో మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మంత్రి సీతక్కను (Seethakka) హెచ్చరిస్తూ ఇటీవల మావోయిస్టులు (Maoist Party) లేఖ రాశారంటూ ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ లేఖ విషయంలో తాజాగా మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. మంత్రి సీతక్కపై ప్రకటన మేం చేయలేదని స్పష్టం చేసింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో 26.06.2025న మంత్రి సీతక్కపై వచ్చిన పత్రిక ప్రకటనకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ స్పష్టం (Jagan letter) చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై కొనసాగిస్తున్న పాశవిక ఆపరేషన్ కగార్ ను (Operation Kagar) తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని ఎన్ కౌంటర్ లు ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. అణచివేతల ద్వారా మావోయిస్టు పార్టీని నిర్ములించడం సరైనది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలిసిందేనని లేఖలో పేర్కొన్నారు. అయితే తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినా పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీకి సహకారం అందించే ప్రజల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెబుతోందని, మావోయిస్టు పార్టీ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలలో అమాయక ఆదివాసి ప్రజలను పోలీస్ స్టేషన్ లకు పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు.
డీఎం లొంగుబాటు దుష్ప్రచారమే:
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ లొంగిపోతున్నట్లు ఇటీవల దినపత్రికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. దామోదర్ లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా చేసిన ఈ ప్రకటనలలో ఎలాంటి వాస్తవం లేదని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. పోలీసులే కావాలని ఉద్దేశ పూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని గతంలో కూడా అనేక సార్లు దామోదర్ ఎన్ కౌంటర్ లలో చనిపోయినట్లు, లొంగిపోయినట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. విప్లవ ప్రజలను గందరగోళ పరచడానికి మానసిక యుద్ధంలో భాంగగానే దుష్ప్రచారం కొనసాగుతోందని లేఖలో మావోయిస్టు పార్టీ విమర్శించింది.






