మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేత సుజాతక్క.. కాసేపట్లో పోలీసుల అధికారిక ప్రకటన!

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-13 05:02:50  IST  )

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్‌ సుజాతక్క అలియాస్ మైనక్క తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేత సుజాతక్క.. కాసేపట్లో పోలీసుల అధికారిక ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్‌ సుజాతక్క అలియాస్ మైనక్కను ఈరోజు మీడియా ఎదుట హాజరుపర్చనున్నారు. తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమైన విషయంపై విలేకరుల సమావేశం ఉందంటూ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో సుజాత‌క్కతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కాగా, గద్వాల ప్రాంతానికి చెందిన కల్పన అలియాస్ సుజాతక్క ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఏకైక మహిళా నాయకురాలిగా కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 2011 జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ సతీమణే ఈ కల్పన. ప్రస్తుతం ఆమె ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో ఇంచార్జ్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో కల్పనను పోలీసులు మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చినా.. అందులో ఏ మాత్రం నిజం లేదని మావోయిస్టు పార్టీ నేతలు కొట్టి పడేసిన విషయం తెలిసిందే.

Next Story