- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ లొంగుబాటు!
మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ లొంగుబాటు

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్(Maoist Azad) అలియాస్ సాంబయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టులంతా లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇచ్చిన పిలుపు మేరకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఆయన లొంగుబాటును పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. కాగా, సాంబయ్యది తెలంగాణలోని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం. ఆయన 1995లో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గతంలో పోలీసులు తెలిపారు. రాష్ట్రకమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆజాద్‌పై రూ.20 లక్షల రివార్డుంది. తాజాగా ఆజాద్‌తో పలువరు కేడర్ కూడా లొంగిపోయినట్లు సమాచారం. ఈ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






