- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు మావోయిస్టు మృతులు బాలకృష్ణ, చంద్రహాస్ అంత్యక్రియలు
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్(Gariaband Encounter)లో భారీ ఎన్‌కౌంటర్ జరిగి దాదాపు 10 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్(Gariaband Encounter)లో భారీ ఎన్‌కౌంటర్ జరిగి దాదాపు 10 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మోడెం బాలకృష్ణ(Maoist Modem Balakrishna) అలియాస్ మనోజ్ ఉన్నారు. శనివారం బాలకృష్ణ మృతదేహాన్ని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అంబర్ పేట స్మశానవాటికలో అంతిమ సంస్కారం జరుగుతుందని అమరుల బంధుమిత్రుల సంఘం తెలిపింది. మిత్రులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు అందరూ పాల్గొని ఘనంగా జోహార్లు అర్పిస్తూ.. తుది విడ్కోలు పలకాలని కోరుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. ఉదయం 11 గంటల నుంచి సుల్తాన్ పుర రోడ్ న.1 నుంచి చాదర్ ఘాట్ వరకు అంతిమయాత్ర ఉంటుందని వెల్లడించారు.
ఇదే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మరో కీలక నేత చంద్రహాస్ అలియాస్ పాండు అలియాస్ ప్రమోద్ అంత్యక్రియలు కచ్చేరి బండ యాప్రాల్లో రేపు ఉదయం 11 గంటలకు జరుగనుంది.






