- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌తో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతలు భేటీ కానున్నారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేకే సైతం పాల్గొంటారు.

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతలు భేటీ కానున్నారు. దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేకే సైతం పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఈ మావోయిస్టు నేతలు ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన సంగతి తెలిసిందే. దీంతో సమావేశంలో ఏం చర్చించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. భేటీ అనంతరం లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమం కోసం ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఆపరేషన్ కగార్ సమయంలో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులపై మెరుపు దాడులను ఖండించింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం మావోయిస్టులు శాంతియుతంగా లొంగిపోవాలని కోరారు.
Next Story






