- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత ఆనంద్ మృతి
అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత ఆనంద్ మృతి

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు అగ్ర నాయకుడు ఆనంద్(Maoist Anand) అనారోగ్యంతో సోమవారం (డిసెంబర్ 8 2025)మృతి చెందారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని స్వగ్రామం చింతిరేలలో ఆయన కన్నుమూశారు. ఆనంద్ అసలు పేరు తోట సీతారామయ్య. చీరాలలో బీఎస్‌సీ చదువుకుంటున్నప్పుడు రాడికల్ విద్యార్థి సంఘంలో భాగమయ్యారు. 1980లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. మొదటగా ఆర్గనైజేషన్ రంగంలో పనిచేశారు. 1986లో పీస్ బుక్ సెంటర్ మూత పడ్డాక పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ, ఏపీ రాష్ట్ర కమిటీ స్టాప్‌లో భాగంగా పట్టణాలలో పనిచేశారు. నిర్బంధం కారణంగా పట్టణాల్లో పనిచేయలేని పరిస్థితుల్లో ఆనంద్ కేంద్ర కమిటీ పనుల్లో భాగంగా 1995 తర్వాత దండకారణ్యానికి వచ్చారు. సీసీ వాళ్ళ డాక్యుమెంట్స్ టైపింగ్, కరెక్షన్స్ ఇంకా సర్క్యులర్స్ టైపింగ్స్ అన్నీ ఆనందే చేసేవాడు. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాల లక్ష్మణ రావు) వద్ద చాలా కాలం పనిచేశారు. మితంగా మాట్లాడే ఆనంద్ రోజుకు 16 గంటలపాటు అజ్ఞాతంలో పనిచేశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యతో, ట్రీట్ మెంట్ కోసం వచ్చి హైదరాబాద్‌లో 2023లో అరెస్టు అయ్యారు. ఆ తరువాత బెయిల్‌పై ఇంటికి వచ్చారు. ఆల్జీమర్స్ కారణంగా ఎవరిని గుర్తు పట్టలేని పరిస్థితిలోనే జీవించారు. తాజాగా ఆయన మృతిచెందడంతో వామపక్ష నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆనంద్ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.






