- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు గణపతి లొంగిపోవాలి.. అన్నకు తమ్ముడు రాంచంద్ర రావు విజ్ఞప్తి
ఆపరేషన్ కాగార్ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత గణపతి తక్షణమే పోలీసులకు లొంగిపోవాలని ఆయన సోదరుడు రామచంద్రరావు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కాగార్’ (Operation Kagar) చరమాంకానికి చేరుతున్న వేళ, మావోయిస్టు పార్టీ అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు. తాజాగా తిపిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న, బడే చొక్కారావు అలియాస్ సాగర్‌తో పాటు సుమారు 20 మంది మావోయిస్టులు పోలీసులకు సరెండర్ అయ్యారు.
ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ టాప్ లీడర్ గణపతి (Ganapathi) ఎక్కడున్నారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ తరుణంలో ఆయన సోదరుడు రామచంద్ర రావు (Ramchandra Rao) మీడియా ద్వారా తన అన్న గణపతికి కీలక విజ్ఞప్తి చేశారు. వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన విన్నవించారు. గణపతి రాక కోసం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గణపతితో కలిసి పనిచేసిన వారంతా ఇప్పటికే లొంగిపోయారని, ఆయనపై 12 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని తెలిపారు. గణపతి గనుక లొంగిపోతే, ఆయనపై ఉన్న కేసులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని రామచంద్రరావు కోరారు.






