- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టుల ఎన్కౌంటర్‌లు.. అఖిలపక్ష పార్టీలు రౌండ్‌టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయం
మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర జరుపుతున్న ఎన్‌కౌంటర్లపై అఖిలపక్ష పార్టీలు మండిపడ్డాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర జరుపుతున్న ఎన్‌కౌంటర్లపై అఖిలపక్ష పార్టీలు మండిపడ్డాయి. మావోయిస్టులను బీజేపీ సర్కార్ బూటకపు ఎన్ కౌంటర్‌లు చేస్తోందని సీపీఐ ఆధ్వర్యంలో గురువారం అఖిలపక్ష పార్టీలు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. మావోయిస్టులపై కేంద్రం ఫేక్ ఎన్‌కౌంటర్లు చేస్తోందని అఖిలపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ మీద ఎన్కౌంటర్‌లపై అఖిలపక్ష పార్టీలు భవిషత్ కార్యాచరణ ప్రకటించాయి. రేపు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయాలని, అలాగే సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం నేత, జూలకంటి రంగారెడ్డి, పౌరహక్కుల సంఘం నేతలు, ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ చంద్ర కుమార్, విమలక్క తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అన్యాయంగా పట్టుకున్న వాళ్లను ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారని రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతలు మాట్లాడారు. బలమైన ఉద్యమంతోనే కేంద్రానికి బుద్ధి చెప్పగలం పిలుపునిచ్చారు. బూటకపు ఎన్ కౌంటర్ లను ప్రభుత్వం మానుకోవాలని, లొంగిపోతున్న మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో చంపొద్దని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్‌ల మీద విచారణ జరపాలని అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు.






