‘మా సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరితరం కాదు’.. మావోయిస్టు చంద్రన్న కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-28 10:57:55  IST  )

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ(Maoist Party) కీలక నేత పుల్లూరి ప్రసాదరావు(Pulluri Prasada Rao) అలియాస్ చంద్రన్న కీలక వ్యాఖ్యలు చేశారు.

‘మా సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరితరం కాదు’.. మావోయిస్టు చంద్రన్న కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ(Maoist Party) కీలక నేత పుల్లూరి ప్రసాదరావు(Pulluri Prasada Rao) అలియాస్ చంద్రన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాది లొంగుబాటుకాదు.. అభివృద్ధిలో కలిసి పనిచేయడానికే జనజీవన స్రవంతిలో కలిశాం.. ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పోరాటం చేశాం.. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం.. మా సిద్ధాంతం ఓడిపోలేదు.. ఓడించడం కూడా ఎవరితరం కాదు.. ప్రజల మధ్య ఉండి సేవ, పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం.. ఆయుధాలను పార్టీకే ఇచ్చి జనంలోకి వచ్చాం’’ అని చంద్రన్న కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చంద్రన్న.. మావోయిస్టు పార్టీలో 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ చంద్రన్నతో పాటు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ ప్రకాశ్‌ కూడా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు.

Read More... మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. కీలక నేత చంద్రన్న లొంగుబాటు

Next Story