- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిజానికి ముంగింపు లేదు.. డీజీపీ సమక్షంలో రాజీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మావోయిజం ముంగింపుపై మల్లారాజీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ముగ్గురు అగ్రనేతలతో కలిసి లొంగిపోయిన ఆయన ఇవాళ డీజీపీ సమక్షంలో మీడియాతో మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మావోయిజం ఎప్పుడూ ముగియదని, ప్రపంచ వ్యాప్తంగా మావోయిజం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అన్నారు. తమ సిద్ధాంతాలకు అనుగుణంగా అవకాశాల మేరకు ప్రజల సమస్యలపై పోరాడుతామన్నారు. ఇంత కాలం ఏదైతే రాజకీయాలు, సిద్ధాంతాలు చెబుతూ ప్రజలను సంఘటితం చేశామో ఆ అవగాహనను మా నుంచి తొలగించుకోబోమన్నారు. డీజీపీ సమక్షంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారుల పిలుపు మేరకు తాము లొంగిపోయామని ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. అవకాశం వచ్చిన మేరకు ప్రజాపోరాటాల వెనుక ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు. అజ్ఞాతం వీడిన మేము నలుగురం కూడా అనుకుని బయటకు రాలేదని, వీటి వెనుక అనేక కారణాలు ఉంటాయన్నారు. వాటన్నింటిని చెప్పుకోవడానికి ఇక్కడ సమయం లేదన్నారు. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిని ప్రభుత్వంతో చర్చించుకుని మిగతా మావోయిస్టులకు ఏం సందేశం ఇవ్వాలనేది మేం నిర్ణయించుకుని బహిరంగ పరుస్తామన్నారు.






