Bhanu Prakash Reddy : విజయసాయి బాటలోనే చాలమంది : బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-25 05:02:15  IST  )

వైసీపీ నేత విజయసాయిరెడ్డి(YSRCP Leader Vijayasai Reddy) బాటలోనే చాలమంది ఆ పార్టీని వీడనున్నార(Leaving The Ycp Party)ని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి(BJP leader Bhanu Prakash Reddy)జోస్యం చెప్పారు.

Bhanu Prakash Reddy : విజయసాయి బాటలోనే చాలమంది : బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత విజయసాయిరెడ్డి(YSRCP Leader Vijayasai Reddy) బాటలోనే చాలమంది ఆ పార్టీని వీడనున్నార(Leaving The Ycp Party)ని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి(BJP leader Bhanu Prakash Reddy)జోస్యం చెప్పారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై వైసీపీ నేతలకు నమ్మకం పోయిందని..అందుకే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో లేకుండా కేవలం తాడేపల్లి ప్యాలెస్ కే జగన్ పరిమితమయ్యాడని, గాలిలో తిరిగే నాయకుడిగా జగన్ మిగిలిపోయారని, ఆయనను గాలిలోనే త్రిశంకు స్వర్గంలో ప్రజలు, వైసీసీ నాయకులు ఉంచుతారని వ్యాఖ్యానించారు.

2024అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని, ఇప్పటికే ముగ్గురు ఎంపీలు కూడా పార్టీని వీడారని, అయోధ్య రాంరెడ్డి కూడా త్వరలో పార్టీ వీడుతారని తెలుస్తుందన్నారు. వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తుంది. విజయసాయిరెడ్డి రాజీనామా అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయసాయి రెడ్డి నేడు ఉప రాష్ట్రపతిని కలిసి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా లేఖ ఇవ్వనున్నారు.

భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనని..జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ తనకు పార్టీలోను అత్యున్నత పదవితో పాటు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేసి గౌరవించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తొమ్మిదేళ్ల పాటు నన్ను ప్రోత్సహించిన ప్రధాని మోడీకి, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో రాజకీయ విభేధాలే తప్ప వ్యక్తిత విభేధాలు లేవన్నారు. ఇక వ్యవసాయం చూసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ పరిణామం వైసీపీకి, ముఖ్యంగా జగన్‌కు ఎదురుదెబ్బని కొందరి వాదిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం వెనుక పార్టీ వ్యూహం ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది.

Next Story