ఒకే ఇంటి నంబర్‌తో వందల ఓట్లు

by velandi.Saikiran |   (  Updated:2026-07-03 23:00:23  IST  )

రాష్ట్రంలో చేపడుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ లో అనేక చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఒకే ఇంటి నంబర్‌తో వందల ఓట్లు
X

ఖాళీ ప్లాట్స్ నెంబర్స్‌తో వందల ఓట్లు

ఒకే ఇంటి నంబర్‌తో వందల ఓట్లు

సర్‌తో వెలుగులోకి చిత్ర విచిత్రాలు

ఇంటింటికీ తిరగకుండా సెంటర్ కూర్చొని ఫార్మ్స్ పంపిణీ చేస్తున్న బీఎల్‌ఓలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చేపడుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ లో అనేక చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటరు జాబితాలో ఇష్టానుసారంగా ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేశారనే విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. రెవెన్యూ అధికారులు, మున్సిపల్​ అధికారులు గతంలో ఇష్టారీతిన, ఏ మాత్రం విచారణ చేయకుండా వందలు వేల సంఖ్యలో ఓటర్లను నమోదు చేశారని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడ్చల్​ , రంగారెడ్డి, హైదరాబాద్​, సంగారెడ్డి పట్టణ ప్రాంతాలకు చెందిన జిల్లాల్లో ఖాళీ స్థలాల ఫ్లాట్​ నెంబర్స్​ సైతం చూపించి ఓట్లు నమోదు చేయించారని గుర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని ఓటరు జాబితాలోని పేర్లందరితో ఎన్యుమరేషన్​ ఫారాలు ముద్రించి ఇవ్వడం ప్రారంభం కావడంతో అక్రమాలు, ఇష్టారితిన చేసిన ఓటర్ల నమోదు వెలుగులోకి వచ్చాయి. నగరంలో ఒక శివారు ప్రాంతంలోని జిల్లాలో ఖాళీ స్థలం ఫ్లాట్​ నెంబర్​ ను చూపించి 200కు పైగా ఓట్లు ఉన్నాయని గుర్తించారు. ఇప్పుడు ఖాళీ స్థలమని తెలడంతో ఏం చేయాలో బీఎల్​వోలకు, మున్సిపల్​ అధికారులు అవాక్కకావడం వారి వంతైందని సమాచారం. ఖాళీ స్థలంలో వందల సంఖ్యలో ఓట్లు ఎలా నమోదు అయ్యాయని ఒకరి మొఖం ఒకరు చూసుకుంటాఉన్నారని, ఒకరి ఒకరు నేపం మోపుకుంటున్నారని తెలిసింది. దీనితో పాటుగా అదే జిల్లాలో ఒకే ఇంటి నెంబర్​ పై 100కు పైగా ఓట్లు ఉన్నాయని గుర్తించారు.

ఆ ఇంటి నెంబర్​ వెతుక్కు వెళ్లిన బీఎల్​వో షాక్​ గురయ్యారని సమాచారం. ఒకే ఇంటి నెంబర్​ ఇన్ని ఓట్లు ఏ విధంగా ఉన్నాయని ఆ ఇంటి యజమానిని ప్రశ్నించినట్లుగా సమాచారం. గతంలో ఇక్కడ ఇటుబట్టిలు తయారు చేసే కూలీలు ఉండేవారని, వారందరిని ఓటర్లుగా నమోదు చేయించారని చెప్పినట్లుగా తెలిసింది. దీంతో ఆ 100 మంది ఎక్కడ అని ప్రశ్నించగా వారు వేరే ప్రాంతానికి వెళ్లారని సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది. ఒకే ఇంట్లో 100 మంది ఉండటం సాధ్యమేనా, అలా ఏలా నమోదు చేశారని ఇంటి యజమానిని నిలదిసినట్లుగా తెలిసింది. దీంతో ఆయ యజమాని నీళ్లు నమిలినట్లుగా తెలిసింది. ఇలాంటి ఓటర్ల నమోదుతో దొంగ ఓట్లు వేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. నిజమనే రాజకీయ విశ్లేషకులు నమ్ముతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయని తెలిసింది. వీటన్నంటిపై ఏం చేయాలనే దానిపై ఎన్నికల అధికారులకు ఆయా జిల్లాల అధికారులు సమాచారం అందిస్తున్నారు. తదుపరి ఏం చేయాలి, దొంగ ఓట్లు నమోదు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా తదితర వాటి గురించి స్పష్టతను ఎన్నికల సంఘం అధికారులను అడిగినట్లుగా తెలిసింది.

దీనితో పాటుగా పట్టణాలు, నగరాల్లోని బీఎల్​వోలు ఎన్యుమరేషన్​ ఫారాలు పంపిణి ని ఇంటింటికి తిరుగుతు పంపిణి చేయాలి. కానీ నగరాల్లో అనేక ప్రాంతాల్లో కమ్యూనిటి హాల్స్​, వారి ఇళ్లలో కూర్చోవడం, సెంటర్​లో ఒక ప్రాంతంలో కూర్చోవడం చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇంటింటికి వెళ్లకుండా ఒకే దగ్గర ఉండి ఇవ్వడం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్దం. ఇంటింటికి తిరిగి ఇవ్వడం వల్ల వారు అక్కడ నివాసం ఉంటున్నారా లేదా, వేరే ప్రాంతంలో ఉంటున్నారా అనేది తెలుస్తుంది. అదే సమయంలో ఒకే దగ్గర ఒకే ఇంట్లో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటే గుర్తించవచ్చు. వారిని అనుమానాంచాల్సి ఉంటుంది. చిన్న ఇంట్లో పదుల సంఖ్యలో ఓటర్లు ఉండటం ఏ విధంగా సాధ్యమనేది తెలుస్తుంది. ఈ ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్లాలనే నిబంధనను కొందరు బీఎల్వోలు ఉల్లంఘిస్తున్నారు. అదే సమయంలో గత నెల 25 నుంచి ఎన్యుమరేషన్​ ఫారాల పంపిణి ప్రారంభం కాగా ఇప్పటి వరకు కేవలం కొన్ని పోలింగ్​ బూతుల పరిధిలో కేవలం 20‌‌–30 శాతం ఎన్యుమరేషన్​ ఫారాలు మాత్రమే పంపిణి పూర్తి చేశారు. రాష్ట్ర రాజధాని, శివారు ప్రాంతాల్లో జిల్లాల్లో ఫారాలు పంపిణి నత్తనడకన సాగుతోంది. కొందరు బీఎల్​వోలు యాక్టివ్​ లేరని గుర్తించారు. మున్సిపాలిటిలకు చెందిన శానిటేషన్​ సిబ్బందిని, ఈ ప్రక్రియపై అవగాహన లేని వారిని నియమించారని ఆరోపిస్తున్నారు.

Next Story