- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తడిబట్టలతో సిద్ధిపేటలో ప్రమాణం చేద్దామా?.. హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి కౌంటర్
హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేబినెట్ సమావేశంలో జరిగిన చర్చలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) కౌంటర్ ఇచ్చారు. తడిబట్టలతో కేబినెట్ సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మరి తన వ్యాఖ్యలకు హరీశ్ రావు కట్టుబడి ఉంటారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో సిద్ధిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తడిబట్టలతో వచ్చి నా తల్లిదండ్రులపై ఒట్టేసి మరి ప్రమాణం చేస్తానని మరి తను ప్రమానం చేయడానికి హరీశ్ రావు సిద్ధమేనా అని చాలెంజ్ చేశారు. ఈ సవాల్ కు సిద్ధంగా ఉంటే హరీశ్ రావే డేట్, టైమ్ ఫిక్స్ చేయాలన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీపై హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గం దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని, కేబినెట్ మీటింగ్‌లో మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన అడ్లూరి మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ సెటిల్ మెంట్లు, కమీషన్లు, దోచుకోవడం, దాచుకోవడం స్వయంగా కేసీఆర్ బిడ్డ, మీ బంధువు కవితే చెప్పారని ముందు కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని కౌంటర్ వేశారు. 2004 లో హరీశ్ రావు ఆస్తులెంతా ఇప్పుడు మీ ఆస్తులెంతో చెప్పాలన్నారు.






