- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగర సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన మంగ్లీ
దుష్ప్రచారంపై సింగర్ మంగ్లీ ఫిర్యాదు! సజ్జనార్‌ను కలిసి తన ఆవేదన వ్యక్తం చేసిన గాయని. అడ్వకేట్ సుబ్బారావుపై చర్యలకు డిమాండ్.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ గాయని మంగ్లీ (Singer Mangli) మైక్రో ఫైనాన్స్ వివాదం కేసు (Microfinance dispute case) ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో ఆమె ఈరోజు నగర సీపీ వి.సి. సజ్జనార్ (CP V.C. Sajjanar)ను కలిశారు. తనపై సోషల్ మీడియాలో, ఇతర వేదికల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆమె ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి తనపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేస్తున్న సదరు అడ్వకేట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంగ్లీ ఈ సందర్భంగా కోరారు.
బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి..
కేవలం తనపైనే కాకుండా, పలువురు బాధితులపై కూడా ఇలాగే తప్పుడు ప్రచారాలు సాగుతున్నాయని మంగ్లీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని, వెంటనే విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విన్నవించారు. మంగ్లీ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన సజ్జనార్.. చట్టప్రకారం ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని మంగ్లీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.






