అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

by Ajay Maddhiboyina |

ఫోక్ సింగ‌ర్ మంగ్లీ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఇటీవ‌ల తాను యూట్యూబ్ లో విడుద‌ల చేసిన బాయిలోనే బ‌ల్లి పలికే పాట‌పై ఓ వ్య‌క్తి అస‌భ్య‌క‌ర కామెంట్స్ చేశాడంటూ ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది.

అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ
X

దిశ, వెబ్ డెస్క్: ఫోక్ సింగ‌ర్ మంగ్లీ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఇటీవ‌ల తాను యూట్యూబ్ లో విడుద‌ల చేసిన బాయిలోనే బ‌ల్లి పలికే పాట‌పై ఓ వ్య‌క్తి అస‌భ్య‌క‌ర కామెంట్స్ చేశాడంటూ ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. పాట‌ను మాత్ర‌మే కాకుండా ఎస్టీ సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా నీచంగా మాట్లాడాడ‌ని ఆరోపించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా వచ్చిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాటకు కమల్ ఎస్లావత్ లిరిక్స్ అందించారు.సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. ఇక మంగ్లీ స్వయంగా పాటను పాడటంతో పాటు అందులో స్టెప్పులు వేసింది. మంగ్లీతో పాటు నాగవ్వ సైతం ఈ పాటను పాడారు. ఈ పాట విడుదలై 5 రోజులు కాగా ఇప్పటికే 8 మిలియిన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.

Next Story