- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు.. సుప్రీం తీర్పుపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. కుల వ్యవస్థనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దళితులు క్రిస్టియన్‍గా మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుంతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. క్రిస్టియన్ గా మారితే ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాలన్నారు. ఈ పార్లమెంట్‍కు, న్యాయవ్యవస్థకు, రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే కుల వ్యవస్థ రద్దు చేయాలన్నారు. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా ఉండదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవాళ హైదరాబాద్ సోమాజిగూడ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.. 1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని అయితే ఈ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని ఇవి వివక్షతో కూడిన ఉత్తర్వులు అన్నారు. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యల కోసం ముందుకు ఏ పార్టీ, ఏ సంస్థ తీసుకున్నా దానిని స్వాగతిస్తామని, వారికి అండగా నిలబడతామన్నారు.






