- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manda Krishna Madiga : సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ(MRPS President Manda Krishna Madiga) బహిరంగ లేఖ(Open Letter) రాశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ(MRPS President Manda Krishna Madiga) బహిరంగ లేఖ(Open Letter) రాశారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్(Justice Shamim Aktar Commission) నివేదికలో కొన్న లోపాలు ఉన్నాయని తెలిపారు. ఈ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటే కొన్ని దళిత కులాల హక్కులు, వాటా, వారి అస్తిత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలపై, షమీమ్ కమిషన్ నివేదికపై చర్చించి.. కొన్ని వినతులు, సూచనలు సీఎంకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సాధ్యమైనంత త్వరలో మిమ్మల్ని కలిసి కూలంకషంగా చర్చించేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే నివేదికను ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా ఎస్సీల వర్గీకరణ చేశారు. ఈ క్రమంలో ఎస్సీల వర్గీకరణపై షమీమ్ కమిషన్ సమర్పించిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరుతూ మందకృష్ణ మాదిగ సీఎంకు లేఖ రాశారు.






