Manda Krishna Madiga : రంగరాజన్ ను పరామర్శించిన మంద కృష్ణమాదిగ

by Muthe.Rajitha |   (  Updated:2025-02-14 15:40:28  IST  )

ఇటీవల 'రామరాజ్యం సైన్యం' చేతిలో చిలుకూరు బాలాజీ ఆలయ(Chilukuru Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్(Rangarajan) దాడికి గురైన విషయం తెలిసిందే.

Manda Krishna Madiga : రంగరాజన్ ను పరామర్శించిన మంద కృష్ణమాదిగ
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల 'రామరాజ్యం సైన్యం' చేతిలో చిలుకూరు బాలాజీ ఆలయ(Chilukuru Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్(Rangarajan) దాడికి గురైన విషయం తెలిసిందే. కాగా నేడు రంగరాజన్ ను కలిసి పరామర్శించారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు, మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga).. ఈ సందర్భంగా దాడి వివరాలను రంగరాజన్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడి హేయనీయమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. ఈ విషయంలో రంగరాజన్ కి న్యాయం జరిగే వరకు తోడు ఉంటామని అన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో 'రామరాజ్యం సైన్యం' అధ్యక్షుడు వీర రాఘవ రెడ్డి(Veera Raghava Reddy) ఆధ్వర్యంలో కొంతమంది ఆయనపై దాడి చేశారు. దీనిపై ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దాడిలో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి సహ 13 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా... పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాడి నేపథ్యంలో పలువురు రాజకీయ పార్టీల నేతలు రంగరాజన్ ను పరామర్శించారు. కేటీఆర్(KTR) మరికొందరు ఆ పార్టీ నాయకులు ఇంటికి వెళ్లి పరామర్శించగా.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

Next Story