- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manchu: జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి.. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సంచలన ప్రకటన
జర్నలిస్ట్(Journalist) పై సినీ నటుడు మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) చేసిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు సహా పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: జర్నలిస్ట్(Journalist) పై సినీ నటుడు మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) చేసిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు సహా పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. మోహన్ బాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఘటనపై తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్(Formar Press Akadamy Chairman) అల్లం నారాయణ(Allam Narayana) స్పందిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వాహణలో ఉన్న జర్నలిస్ట్ పై దాడి చేయడం సరికాదని, దాడిని ఖండిస్తున్నామని అన్నారు.
మీడియా స్వేచ్చకు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించరాదని చెప్పారు. మోహన్ బాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక చర్యలు తీసుకోని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాగా మంచు ఫ్యామిలీలో గొడవల కారణంగా జర్నలిస్టులు మంచు మనోజ్ తో పాటు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ మీడియా జర్నలిస్ట్ మోహన్ బాబును గొడవల గురించి వివరణ అడిగారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడికి దిగారు. జర్నలిస్ట్ చేతిలో ఉన్న మైక్ లాక్కోని దానితో జర్నలిస్ట్ పై దాడి చేశారు. దీంతో జర్నలిస్ట్ కు గాయాలు అయ్యాయి.






