Manchu Family War: జల్ పల్లిలో మంచు మనోజ్ ధర్నా.. తండ్రితో కిలిసి ఆ రాష్ట్ర సీఎం వద్దకు అన్న విష్ణు

by Prasad Jukanti |   (  Updated:2025-04-09 07:33:55  IST  )

మరోసారి మంచు ఫ్యామీలీ రచ్చ వీధికెక్కింది.

Manchu Family War: జల్ పల్లిలో మంచు మనోజ్ ధర్నా.. తండ్రితో కిలిసి ఆ రాష్ట్ర సీఎం వద్దకు అన్న విష్ణు
X

దిశ, డైనమిక్ బ్యూరో/బడంగ్ పేట్: ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఫ్యామిలీలో గొడవలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా మరోసారి మంచు ఫ్యామీలీ రచ్చ వీధికెక్కింది. ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా జల్ పల్లిలోని (Jal Palli) మోహన్ బాబు ఇంట్లోకి ఆయన కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన లోపలికి వెళ్లేందుకు సిబ్బంది గేటు తెరవలేదు. అనుమతి లేనిదే ఎవరు లోపలికి రాకూడదని మోహన్ బాబు ఆర్డర్ అనే హెచ్చరిక బోర్డును గేటుకు ఏర్పాటు చేశారు. అయితే తాను లోపలకి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఉంది అంటూ మనోజ్ చెప్పినా ఆయనను మోహన్ బాబు సిబ్బంది లోపలకి అనుమతి ఇవ్వలేదు. దీంతో మంచుమనోజ్ గేటు బయటే బైఠాయించి నిరసనకు దిగారు. ఈ క్రమంలో మనోజ్ కోసం ఆయన భార్య మౌనిక అక్కడికి వచ్చారు. కాగా మంచు మనోజ్ వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు మోహన్ బాబు నివాసం వద్ద భారీగా మోహరించారు. పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు ఇంటికి రెండు కిలోమీటర్ల దూరం అవతలే అందరిని ఆపేస్తూ ఎవరీ ఇంటివైపు అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మంచుమనోజ్ తన తండ్రి ఇంటి గేటు బయట ఆందోళనకు దిగడంతో అక్కడటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

నిన్న పోలీసులకు ఫిర్యాదు:

తన కారు పోయిందని మంగళవారం మంచు మనోజ్ నార్గింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 1వ తేదీన తన పాప పుట్టిన రోజు వేడుకల నిమిత్తం రాజస్థాన్ వెళ్లగా ఇది ఆసరగా చేసుకుని నా సోదరుడు విష్ణు (Manchu Vishnu) 150 మందితో జల్ పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి నా వస్తువులు, సామాగ్రి ధ్వంసం చేశారని మనోజ్ ఆరోపించారు. మా కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తికెళ్లి రోడ్డుమీద వదిలేశాడని, నా కారను దొంగిలించి విష్ణు ఇంట్లో పోర్క్ చేశారని ఆరోపించారు. అలాగే జల్ పల్లిలోని నా సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారని నా కారును మనోజ్ ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారని మనోజ్ నిన్న ఆరోపించారు.

నిరూపిస్తే అర గుండుతో బయట తిరుగుతా:మంచు మనోజ్

ఇది ఆస్తి గొడవ కాదని, పిల్లలు (విద్యార్థుల) భవిష్యత్తు కోసమే ఇందంతా. అక్కడే మొదలైంది ఈ గొడవ అని మంచు మనోజ్ అన్నారు. మోహన్ బాబు ఇంటి ఎదుట బైఠాయించిన మనోజ్ మీడియాతో మాట్లాడారు. తనకు ఈ ఆస్తి వద్దని నాన్నకు ఎప్పుడో చెప్పానన్నారు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతుంటే ఇప్పటి వరకు పోలీసులు ఒక్క చార్జిషీట్ ఫైల్ చేయలేదని, కత్తులు, కర్రలతో మాపైకి వచ్చినా అన్ని ఆధారాలు ఇచ్చినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ ఇంట్లో ఉండేందుకు వాళ్లతో పాటు నేనూ ఉండేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ వాళ్లు రంగారెడ్డి కోర్టును తప్పుదారి పట్టించి స్టే తీసుకువచ్చారు. నేను దాన్ని కోర్టులో నిరూపించడంతో కోర్టు వారిని మందలించి ఆ స్టేను తొలగించింది. ఇప్పుడు తన వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు వాహనాలను దొంగతనం చేశారని ఆరోపించారు. ఈ విషయం బయటకు రావాలంటే ఈ ఇంట్లో, రొడ్డు వెంబడి సీసీ టీవీ ఫుటేజ్ బయటకు తీయాలన్నారు. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ బయట పెడితే అర గుండి గీయించుకుని వీధిలో తిరుగుతానని చాలెంజ్ చేశారు. పోలీస్ సమిషనర్ బైండోవర్ ను అనేక సందర్భాల్లో విష్ణు అతిక్రమించారని ఆరోపించారు. తాను తప్పు చేసినట్లు ఒక్క ఆధారం ఉన్నా క్షమాపణలు కోరుతానన్నారు.

యూపీ సీఎంతో మోహన్ బాబు, విష్ణు భేటీ:

ఓ వైపు జల్ పల్లి నివాసం వద్ద మంచుమనోజ్ ఆందోళనకు దిగగా మరో వైపు మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణు, ప్రభుదేవా తదితరులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో (UP CM Yogi Adhityanath) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విష్ణు తదుపరి చిత్రం కన్నప్ప సినిమాపై ఈ సందర్భంగా చర్చించారు.

Next Story