- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలోకి మంచు లక్ష్మీ? ఢిల్లీ టూర్ వెనక కారణమదేనా!
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందా?

దిశ, వెబ్‌డెస్క్: మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందా? పీఎం ఆఫీస్ నుంచి కాల్ రావడంతో కాషాయ కండువా కప్పుకోవడం ఫిక్సేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంచు లక్ష్మీని కాషాయ పార్టీ పెద్దలు పిలిచినట్లు తెలిసింది. పీఎం ఆఫీసు నుంచి ఫోన్ కాల్ రావడంతో రేపు ఢిల్లీకి మంచు లక్ష్మీ పయనవుతున్నట్లు సమాచారం. ఇక, గతంలో టీడీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చిన మోహన్ బాబు ప్రస్తుతం వైఎస్ఆర్టీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల మంచు మనోజ్ టీడీపీ నేత కూతురు భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. దీంతో ఒకే కుటుంబంలో మూడు పార్టీలు అంటూ చర్చ మొదలైంది. మరోవైపు మంచు విష్ణు జగన్ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మంచు లక్ష్మీకి పార్టీలో కల్పించే ప్రాధాన్యత, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి పోటీ అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా మంచు లక్ష్మీ బీజేపీలో చేరిక అంశంపై ఇరు పక్షాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.






