మాల జేఏసీ వర్కింగ్ చైర్మన్‌గా మంచాల లింగస్వామి

by Satheesh |

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు, ఆల్ మాల స్టూడెంట్స్

మాల జేఏసీ వర్కింగ్ చైర్మన్‌గా మంచాల లింగస్వామి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) వ్యవస్థాపకుల్లో ఒకడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత పదేళ్లుగా పని చేస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం జనగాం గ్రామానికి చెందిన డాక్టర్ మంచాల లింగస్వామి మాల జేఏసీ వర్కింగ్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లో వివిధ మాల సంఘాలు పాల్గొన్న సమావేశంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య డాక్టర్ మంచాల లింగస్వామిని వర్కింగ్ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.

అనంతరం డాక్టర్ మంచాల లింగస్వామి మీడియాతో మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం గొంతెత్తి నినాదించి అణిచివేతలకు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మాలలు నేడు తమ స్వంత కులం ప్రయోజనాల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలకు ఊపిరి పోసిన మాలలు పోరాటాలకు దూరమవడంతో పాలక పక్షాలు మాలల్ని విస్మరిస్తున్నాయని తెలిపారు.

దళిత బంధు పథకంలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. దళిత బంధు రెండో విడత మాలలకు 50 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. మాలలు రాజకీయాల్ని శాసించే శక్తిగా ఎదగాలని, మాలల అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కులు, అవకాశాల కోసం కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Next Story