- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bathukamma song: మన బతుకమ్మ 2025 పూర్తి వీడియో సాంగ్ విడుదల.. గీతం వెనక గోరటి వెంకన్న ప్రతిభ
తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే బతుకమ్మ పండుగ వైభవాన్ని, స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా, మన బతుకమ్మ 2025 పూర్తి వీడియో సాంగ్ నేడు అధికారికంగా విడుదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: (Bathukamma Festival) తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే బతుకమ్మ పండుగ వైభవాన్ని, స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా, (Mana Bathukamma 2025) మన బతుకమ్మ 2025 పూర్తి వీడియో సాంగ్ నేడు అధికారికంగా విడుదలైంది. (Telangana Tourism) తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమర్పణలో, తెలంగాణ ప్రభుత్వం మద్దతుతో రూపొందిన ఈ దృశ్య గీతం, పండుగ ఆత్మను అద్భుతంగా ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, కేవలం తెలంగాణకే సొంతమైన పుష్పోత్సవమైన బతుకమ్మ మహోత్సవాన్ని ఈ వీడియో పాట కళ్ళ ముందు నిలుపుతుంది. రంగురంగుల పూల ప్రేరణతో సాగే లయబద్ధమైన సంగీతం, ఉత్సాహంగా, సంబరంగా బతుకమ్మ చుట్టూ నృత్యం చేస్తున్న మహిళల దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ గీతం ఇప్పటికే 'తెలంగాణ సంస్కృతికి అద్భుత ప్రదర్శన'గా, 'ప్రతి ఇంట్లో ప్రతిధ్వనించే పాట'గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది.
గీతం వెనుక ఉన్న ప్రతిభ:
ఈ ప్రత్యేక గీతం రూపకల్పనలో ప్రముఖ కళాకారులు పాలుపంచుకున్నారు. పద్మశ్రీ గోరటి వెంకన్న ఈ పాటకు సాహిత్యాన్ని అందించడంతో పాటు గొంతు కలిపారు. సంగీతం సురేశ్ బొబ్బిలి అందించగా, అదితి భావరాజు, మంగ్లీ, గోరటి వెంకన్న లు పాట పాడారు. బద్రప్ప గాజులా దర్శకత్వం వహించారు. నృత్య రూపకల్పన ఈశ్వర్ పెంటి (ప్రేమలో ఫేమ్), ఛాయాగ్రహణం శ్యామ్ దూపాటి, సెకండ్ కెమెరా ఉదయ్ గుర్రాల, ప్రెజెంటర్ అండ్ ప్రొడ్యూసర్- బూసం జగన్ మోహన్ రెడ్డి (ఎండీ- ఆరో అడ్వర్టైజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఈస్ట్ ఎఫ్ఎక్స్). ఈ వీడియో పాట తెలంగాణ సంస్కృతి, కళల గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.






