- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ వీడియో.. కడెం ప్రాజెక్టులో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడు
by Ajay Maddhiboyina |
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు సైతం భారీగా వరద నీరు చేరింది. దీంతో 17 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలారు. గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహానికి చేపలవేటకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. కడెం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ అనే యువకుడు చేపలవేటకు వెళ్లగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. యువకుడిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కృషి చేస్తున్నాయి. video
Next Story






