హైదరాబాద్ కూకట్‌పల్లిలో కిడ్నాప్ కలకలం

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లిలో కిడ్నాప్ క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఈవీఎస్ఆర్ ప్ర‌కాశ్ ను దుండ‌గులు స్కార్పియో వాహ‌నంలో వ‌చ్చి ఎత్తుకెళ్లారు. శ్రీనివాస సివిల్ వ‌ర్క్స్ య‌జ‌మాని రామ‌చంద్ర‌రాజుతో పాటు ఆయ‌న భార్య చంద్రావ‌తి, కుమారుడు ర‌విని సైతం దుండ‌గులు కిడ్నాప్ చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

హైదరాబాద్ కూకట్‌పల్లిలో కిడ్నాప్ కలకలం
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లిలో కిడ్నాప్ క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఈవీఎస్ఆర్ ప్ర‌కాశ్ ను దుండ‌గులు స్కార్పియో వాహ‌నంలో వ‌చ్చి ఎత్తుకెళ్లారు. శ్రీనివాస సివిల్ వ‌ర్క్స్ య‌జ‌మాని రామ‌చంద్ర‌రాజుతో పాటు ఆయ‌న భార్య చంద్రావ‌తి, కుమారుడు ర‌విని సైతం దుండ‌గులు కిడ్నాప్ చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. రూ.20 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని ప్ర‌కాశ్ ను కిడ్నాప‌ర్లు డిమాండ్ చేశారు. మ‌రోవైపు రామ‌చంద్ర‌రాజు కుటుంబ స‌భ్యుల నుండి చెక్కులు, ప్రామిసరీ నోట్లపై నాగ‌రాజు అనే వ్య‌క్తి సంతకాలు తీసుకున్న‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విషయం బయటికి చెబితే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించిన‌ట్టు తెలుస్తోంది. ఏవీఎస్ఎన్ రాజు, శివరామరాజు కీల‌క సూత్ర‌దారులుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కిడ్నాప‌న్ నాగ‌రాజు ప‌రారీలో ఉన్న‌ట్టు స‌మాచారం.

Next Story