- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Electric Shock: విద్యుత్‌ఘాతంతో వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్‌ఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ నల్లబెల్లి: ప్రమాదవశాత్తు విద్యుత్‌ఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రంగాపురం గ్రామానికి చెందిన గుర్రం సునీల్(32) ఇంట్లోకి కరెంటు స్తంభం నుండి వచ్చే వైర్ ప్రమాదవశాత్తు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఓ ప్రైవేట్ వాహనంలో ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా అక్కడ సునీల్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై రామారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






