అప్పుల బాధతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

by Elthuri vijay kumar |

వ్యాపారంలో నష్టాలు రావడంతో పెరిగిన అప్పులు

అప్పుల బాధతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
X

అప్పుల బాధతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

- వ్యాపారంలో నష్టాలు రావడంతో పెరిగిన అప్పులు

- రామడుగు మండలం మోతే గ్రామంలో విషాదం

దిశ, రామడుగు : రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి అప్పులు పెరగడంతో జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామడుగు మండలం మోతే గ్రామానికి చెందిన బత్తిని తిరుపతి గత కొద్ది నెలలుగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా ఇటీవల వ్యాపారం కలిసి రాకపోవడంతో అప్పుల పాలైన తిరుపతి మనస్తాపానికి గురై తన స్వగ్రామమైన మోతేలోని ఇంట్లో గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా బత్తిని మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

Next Story