- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mamunur Airport : మామునూర్ ఎయిర్ పోర్టు కు రాణిరుద్రమ పేరు?
వరంగల్ వాసుల(Warangal Peoples) దశాబ్దల కల(Dream) మామునూర్ ఎయిర్ పోర్టు(Mamunur Airport) నిర్మాణాని(Cconstruction Of Mamunur Airport)కి కేంద్ర ప్రభుత్వం(Central Government) అనుమతివ్వడం(Approval) జిల్లా ప్రజల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్ వాసుల(Warangal Peoples) దశాబ్దల కల(Dream) మామునూర్ ఎయిర్ పోర్టు(Mamunur Airport) నిర్మాణాని(Cconstruction Of Mamunur Airport)కి కేంద్ర ప్రభుత్వం(Central Government) అనుమతివ్వడం(Approval) జిల్లా ప్రజల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మామూనూర్ ఎయిర్ పోర్టుకు ఏ పేరు పెట్టాలా అన్నదానిపై జిల్లా ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చోపచర్చలు మొదలయ్యాయి.
ఈ విమానాశ్రయానికి కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమ దేవి(Queen Rudrama Devi) పేరు పెట్టాలన్న ప్రతిపాదన(Naming Proposal) సోషల్ మీడియాలో జోరుందుకుంది. వరంగల్ గడ్డ అంటేనే కాకతీయ రాజుల(Kakatiya kings) పరిపాలనకు పేరుమోసిందని..అందుకే కాకతీయ మహారాణి రుద్రమదేవి పేరును ఇక్కడి ఎయిర్ పోర్టుకు పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తుంది. రాణి రుద్రమ దేవి ఎయిర్ పోర్టు పేరుతో ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) తో రూపొందించిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కాగా మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మామునూర్ వద్ధ కొత్త బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చింది. 253ఎకరాలు భూసేకరణ చేసి ఇస్తే వెంటనే కొత్త విమానాశ్రయం నిర్మాణం చేపడుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 150కిలోమీటర్ల దూరంలో మరో ఎయిర్ పోర్టు రాకూడదన్న షరతుపై జీఎంఆర్ సంస్థను ఒప్పించి కేంద్రం మామునూర్ ఎయిర్ పోర్టుకు అన్ని అనుమతులు ఇచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ కోసం రూ.205కోట్లు జిల్లా కలెక్టర్ కు విడుదల చేసింది. 223మంది రైతుల 253ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎయిర్ పోర్టు నిర్మాణానికి మొత్తం 949.14ఎకరాల భూమి అవసరముండగా..ఇప్పటికే 696.14ఎరకరాల భూమి ఉంది. అయితే ఏ320 వంటి విమానాలు నడిపేందుకు, మౌలిక వసతుల కోసం మరో 253ఎకరాల భూమి అవసరముంది. వాస్తవానికి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించిన మామునూరు ఎయిర్ పోర్టు 1981వరకు సేవలందించింది. వరంగల్ అజాంజామీ మిల్లు, కాగజ్ నగర్ పేపర్ మిల్ కోసం అప్పట్లో ఇక్కడ విమానాశ్రయం నిర్మించారు. ఇన్నాళ్లకు మళ్లీ ఇక్కడ విమానాశ్రయం పునరుద్ధరించబడి అధునిక హంగులతో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ పోర్టు ప్రాజెక్టు పూర్తయితే వరంగల్ జిల్లా మొత్తం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






