- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mamunur Airport : మామునూర్ ఎయిర్ పోర్టు వద్ధ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ!
వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు క్రెడిట్(Mamunur Airport Credit)కోసం కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) శ్రేణులు పోటాపోటీగా నిర్వహించిన ప్రదర్శలు రెండు పార్టీల మధ్య తోపులాట(fight)కు దారితీశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల వైరల్ గా మారాయి

దిశ, వెబ్ డెస్క్: వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు క్రెడిట్(Mamunur Airport Credit)కోసం కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) శ్రేణులు పోటాపోటీగా నిర్వహించిన ప్రదర్శలు రెండు పార్టీల మధ్య తోపులాట(fight)కు దారితీశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల వైరల్ గా మారాయి. మామునూర్ ఎయిర్పోర్టు మంజూరు ఘనత తమదంటే తమదంటూ బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల పరస్పరం తలపడ్డాయి.
ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం అనుమతించినందుకు ప్రధాని మోడీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు మామునూరు ఎయిర్ పోర్టు దగ్గరకు ప్రదర్శనగా చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్పోర్టు రెడీ అవుతుందంటూ కాంగ్రెస్ శ్రేణులు సైతం పోటీ ప్రదర్శన నిర్వహించాయి.
ఈ సందర్భంగా రెండు పార్టీల శ్రేణులు ఎయిర్ పోర్టు వద్ధ పోటాపోటీ నినాదాలు..వాగ్వివాదాలకు దిగాయి. ఇరువర్గాల మధ్య తోపులాట నెలకొనగా పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి చెదరగొట్టారు.
సీఎంను కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎయిర్ పోర్టు వ్యవహారం కాస్తా ఇప్పుడు రాజకీయ ప్రచారాంశంగా మారింది.
కాగా బీజేపీ నేతలు మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై ప్రధాని మోడీ ప్రత్యేక ఫోకస్ చేశారని..అందుకే ములుగు గిరిజన యూనివర్సిటీ, టెక్స్ టైల్ పార్కు, ఖాజీపేట్ వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ, ఇప్పుడు మామునూర్ ఎయిర్ పోర్టుకు మంజూరీ ఇచ్చారంటూ చెబుతున్నారు.






