కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు సాధించిన మల్లూరు అమ్మాయి

by Bhanu |

కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు సాధించిన మల్లూరు అమ్మాయి
X

దిశ,నిజాంసాగర్ : కూచిపూడి నృత్యం పోటీలలో పాల్గొని గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ ను మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన కుమ్మరి సాయి సహస్ర సాధించారు. సాయి సహస్ర తల్లిదండ్రులు తెలిపిన వివరాల గత 2023 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియం వేదికలో భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నాట్యంలో జమాత శబ్దం అంశంపై ఏడు నిమిషాల పాటు ఒకేసారి 3782 మంది కళాకారులు లయబద్ధంగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ లో చోటు సాధించారు.


ఇందులో నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీలత నాగరాజు దంపతుల కుమార్తే కుమ్మరి సాయి సహస్ర శుక్రవారం గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ కైవసం చేసుకోవడం పట్ల స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ప్రదర్శన చూపారులను మంత్రముగ్ధులను చేసింది.2020 ఫిబ్రవరి 2న చెన్నైలోని త్యాగరాయ చారిట్రబుల్ ఆధ్వర్యంలో 1183 మంది కళాకారులతో నిర్వహించిన ప్రదర్శన రికార్డును వీరు బద్దలు కొట్టారు. దీంతో ఆనాడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పర్యవేక్షకుడు రుషనాద్ రికార్డును ప్రకటించారు.

శుక్రవారం హైదరాబాద్ నగరంలోని అవ్యాయి బాంక్వెట్స్ హాలులో కళాకారులకు గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో కూచిపూడి మాస్టర్ కారుణ్య కత్యాయన్ గీత, గరేత్ వ్వైఎన్ ఓవెన్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, ఆరెకపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, కోల ప్రసాద్ దళిత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్, హైపర్ ఆది జబర్దస్త్ యాక్టర్ తదితరులు పాల్గొన్నారు. మండల అమ్మాయి గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ సాధించడంలో తన వంతు పాత్రను పోషించినందున మండల వాసులు అభినందనలు తెలియజేశారు.


Next Story