- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మళ్లీ రిపీట్ అయితే చర్యలు తప్పవు’.. కోమటిరెడ్డి రాజగోపాల్‌కు మల్లు రవి హెచ్చరిక
కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి(Komatireddy Rajagopal Reddy)కి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి(Mallu Ravi) వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి(Komatireddy Rajagopal Reddy)కి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి(Mallu Ravi) వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని చెప్పారు. చాలా సేపు చర్చించినట్లు తెలిపారు. సమస్య రిపీట్ కాకుండా ఒకసారి చెప్పి చూస్తాం.. మళ్లీ రిపీట్ అయితే తప్పకుండా రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని మల్లు రవి వార్నింగ్ ఇచ్చారు. అనంతరం వరంగల్ పంచాయితీపై మల్లు రవి వివరణ ఇచ్చారు. వరంగల్‌కు నలుగురిని పంపించబోతున్నట్లు తెలిపారు. ఎవరెవరు వెళ్లాలి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. తాను పార్టీలో మంటలు పెట్టడానికి లేను.. నా పని ఫైరింజన్ అని చెప్పారు. మంత్రి పదవి విషయంలో పదే పదే రాజ్ గోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఇక మరోవైపు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయన వైఖరిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపైనా క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు.






