- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mallu Ravi: రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు
నేతలతో సమస్యలుంటే తమకు ఫిర్యాదు చేయాలే తప్ప బరిగంగా మాట్లాడవద్దని మల్లురవి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) పై మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి (Mallu Ravi) అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మల్లురవి నేతృత్వంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ (PCC Disciplinary Committee) భేటీ జరిగింది. నేతల మధ్య విభేదాలు, పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై చర్చించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లురవి తమకు ఫిర్యాదు రాలేదు కాబట్టే కోమటిరెడ్డి విషయంలో చర్చ జరగలేదన్నారు. తమకు ఫిర్యాదు రావాలని లేదా పీసీసీ చీఫ్ అయినా చెప్పాలన్నారు. బహిరంగంగా మాట్లాడితే అది ఎదుటివారికంటే ఎక్కువ పార్టీకి నష్టం చేస్తుందన్నారు. నేతల మధ్య విభేదాలపై స్పందిస్తూ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని అందరూ సమన్వయం పాటించాలన్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు, పీసీసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. కేసీఆర్.. కేటీఆర్ ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని గతంలో అవసరం లేకపోయినా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది వారేనని దుయ్యబట్టారు. కేటీఆర్ తాను తవ్వుకున్న గోతోలో తానే పడ్డారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం ఉంటుందన్నారు. కమిటీ భేటీ సందర్భంగా దళిత నేతతో గొడవ విషయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసు (Notices to Narsa Reddy) ఇచ్చింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.






