- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధమేంటి?.. బండి భగీరథ్ కేసుపై మల్లు రవి హాట్ కామెంట్స్
టీపీసీసీ క్రమశిక్షణ కమిటి మంగళవారం గాంధీభవన్‌లో చైర్మన్ మల్లు రవి నేతృత్వంలో సమావేశం అయింది. ప్రధానంగా ఇటీవల పార్టీలో నెలకొన్న వివాదస్పద అంశాలు, ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్ని వివాదాలపైన చర్చించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ క్రమశిక్షణ కమిటి మంగళవారం గాంధీభవన్‌లో చైర్మన్ మల్లు రవి నేతృత్వంలో సమావేశం అయింది. ప్రధానంగా ఇటీవల పార్టీలో నెలకొన్న వివాదస్పద అంశాలు, ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్ని వివాదాలపైన చర్చించారు. సమావేశం అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, జాన్సీ రెడ్డి పలువురిపై ఫిర్యాదు చేశారని, రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్‌లపై తమకు ఫిర్యాదు అందిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ఇద్దరే అని ఫిర్యాదు అందిందని, కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ తమ వాదన వినిపించారని మల్లు రవి చెప్పారు. ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని ఇద్దరు నేతలు హామీ ఇచ్చారని, అందరూ కలిసి పనిచేస్తే పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటుందని తాము చెప్పినట్లుగా మల్లు రవి అన్నారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ గా ఉన్న శ్రీకాంత రెడ్డి రెండు వర్గాలను కో ఆర్డినేట్ చేస్తారని, ఎవరిని సస్పెండ్ చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో క్రమశిక్షణ కమిటీ వార్నింగ్..
జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎవరికి వాళ్ళు ప్రకటించుకున్నారని, యూత్ కాంగ్రెస్ నేతలు తామే పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు చేస్తే వేటు వేస్తామని, ఎన్నికల్లో అభ్యర్థి పేర్ల ప్రకటనకు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంటుందన్నారు. తానే మళ్ళీ సీఎం అవుతానని ప్రకటించే శక్తి ఉన్నవాడు రేవంత్ రెడ్డి అని మల్లు రవి అన్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాగలరని, సౌత్ ఇండియాలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ పని చేస్తున్నారన్నారు. రేవంత్ దూకుడు అడ్డుకోవడానికే ధర్మపురి అరవింద్ ప్రయత్నం చేస్తున్నారని, సీఎం రేవంత్ ఇమేజ్ చెడగొట్టాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని మల్లు రవి మండిపడ్డారు.
కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధమేంటి?
బండి భగీరథ్ కేసులో చట్టం తన పని తాను చేస్తుందని, కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం ఉంటుంది? అని మల్లు రవి ప్రశ్నించారు. సంజయ్ ను పదవి నుంచి దించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని, సంజయ్ పదవిపోతే తమకి పదవి వస్తుందని పలువురు బీజేపీ నేతలు ఆశపడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై మాట్లాడే ముందు ఆ పార్టీ రెండు ముక్కలైందని, కుటుంబంలో విభదాలతో వారే సొంతంగా పార్టీలు పెట్టుకున్నారని మల్లు రవి విమర్శించారు.






