- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్‌పై కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు.. ఖండించిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేటీఆర్ (KTR) చేసిన వ్యంగ్య వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) ఖండించారు. సీఎంను లొట్టపీసు అనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేటీఆర్ (KTR) చేసిన వ్యంగ్య వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) ఖండించారు. సీఎంను లొట్టపీసు అనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అందుకే రేవంత్ ను రాజీనామా చేయమని అడుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తున్నందుకు రేవంత్ రెడ్డిని లొట్టపీసు ముఖ్యమంత్రి అంటున్నారా ? అని మల్లు రవి ప్రశ్నించారు. పదేళ్లుగా బంగారు తెలంగాణ అంటూ తమ కుటుంబాన్ని మాత్రం బంగారం చేసుకున్న కేటీఆర్ కు.. సీఎంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే అర్హత లేదన్నారు.
కేసీఆర్ దగ్గర దెయ్యాలున్నాయన్న కవిత.. ఆ దెయ్యాలెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ (KCR) కుటుంబంలో అధికార పోరాటం జరుగుతుందని, కేటీఆర్, హరీష్ రావు (Harish Rao), సంతోష్, కవిత అధికారం కోసం పోటీ పడుతున్నారని మల్లు రవి పేర్కొన్నారు. కేటీఆర్ ముందు తమ పార్టీ సంగతేంటో చూస్కోవాలని సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ (BRS) కొద్దిరోజుల్లో ముక్కలు ముక్కలుగా విడిపోతుందని ప్రజలకు అర్థమవుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఎవరి కాళ్లూ పట్టుకోరని, ఆ మాటలు అంటే చెప్పుతో కొడతారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టుల కోసమే రేవంత్ రెడ్డి కేంద్రమంత్రుల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నారని, కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా అసెంబ్లీకి రావట్లేదని దుయ్యబట్టారు. కేటీఆర్.. ముందు కవిత, హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారో అది చూసుకోవాలని ఎంపీ మల్లు రవి సూచించారు.






