- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీపై సీఎం రేవంత్ అన్నదాంట్లో తప్పేముంది? ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్స్
ప్రధాని మోడీ పుట్టుకతో బీసీ కాదని మధ్యలో లిగల్లీ కన్వెర్టెడ్ బీసీ అని మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఇందులో ప్రధానిని అవమాన పరిచే అంశం ఏముందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ (PM Modi) పుట్టుకతో బీసీ కాదని మధ్యలో లిగల్లీ కన్వెర్టెడ్ బీసీ అని మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారని, ఇందులో ప్రధానిని అవమాన పరిచే అంశం ఏముందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి (Mallu Ravi) ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో హాట్ కామెంట్స్ చేశారు. మోడీ పుట్టకతో బీసీ కాకపోవడం వల్ల బీసీల అణచివేత, అవమానాలు ఆయనకు తెలియదన్నారు. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.. అందులో ఎలాంటి రాజకీయ విషయాలు లేదని అన్నారు. రేవంత్ రెడ్డికి బీసీల సమస్యలు బాగా తెలుసు కాబట్టే ఆయన సీఎం కాగానే బీసీ కులగణన చేసి వారి జనాభా లెక్కల ప్రకారం వారికి విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వాటా కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు.
మోడీ గనుక బీసీ అయ్యుంటే బీసీలపై ప్రేమ ఉంటే దేశంలో జనగణనతో పాటు (caste census) కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని అన్నారు. దేశంలో ఎవరు దైవంశసంబుతులు కారని ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ప్రజల మద్దతు ఉన్నవారే నాయకులు అవుతారని తెలిపారు. ప్రధాని మోడీ బీసీ అని పదే పదే చెప్తున్న బీజేపీ మోడీ బీసీల కోసం ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బీసీల సమస్యలు తెలియదని రేవంత్ రెడ్డి అన్నారని, అందులో తప్పు ఏముందని ప్రశ్నించారు. మోడీ బీసీ అయితే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు మోడీని ఒప్పించి బీసీ కులగణన చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






