- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గతం వదిలేయండి.. ఇప్పుడైనా ఆ పనిచేయండి: కేటీఆర్, హరీష్ రావుకు మల్లు రవి కీలక సూచన
బీఆర్ఎస్(BRS) నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)పై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి(Mallu Ravi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)పై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి(Mallu Ravi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు, కేటీఆర్ నోటి వెంట నీతులు వింటుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. చేసేవన్నీ చేసి.. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. వాళ్ళ మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉందని విమర్శించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని 50 ఏండ్లు వెనక్కి తీసుకపోయారని అన్నారు. కులగణన, బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని కొనియాడారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని సెటైర్ వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు గుండు సున్నా ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలను ప్రజలతో పాటు, మీడియా గమనించాలని కోరారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను స్వాగతించండి అని సూచించారు. ప్రజా ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు ప్రజలు తోడుగా ఉండాలని కోరారు.






