- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష్మణ రేఖ దాటొద్దు..!
కాంగ్రెస్పార్టీ లో స్వేచ్ఛ ఉంటుంది, కానీ లక్ష్మణ రేఖ దాటొద్దు అని పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్మల్లు రవి అన్నారు. ఆ

* కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం చైర్మన్మల్లు రవి
* బాధ్యతలు స్వీకరించిన మల్లు రవి
* హాజరైన పీసీసీ ఛీప్, ఇతర నాయకులు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్పార్టీ లో స్వేచ్ఛ ఉంటుంది, కానీ లక్ష్మణ రేఖ దాటొద్దు అని పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవి అన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్శ్రేణులు ఘన స్వాతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా గాంధీ భవన్లో చేరుకున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భం మల్లు రవి మాట్లాడుతూ.. మూడు సార్లు ఎంపీ అయ్యా, ఒకసారి ఎమ్మెల్యే, రెండు సార్లు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిని అయ్యానని చెప్పారు.
కానీ తనకు పార్టీ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా రావడమే ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత లు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని, నాలుగు గోడల మధ్య మీ అభిప్రాయాలను తెలుపవచ్చన్నారు. కానీ ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దు, క్రమశిక్షణ గీత దాటొద్దన్నారు.






