Kharge: చెప్పుకోవడానికి ఏమీ లేని వారు కాంగ్రెస్ పై దుష్ప్రచారం.. బీజేపీపై ఖర్గే సెటైర్

by Prasad Jukanti |   (  Updated:2025-04-08 10:34:08  IST  )

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది.

Kharge: చెప్పుకోవడానికి ఏమీ లేని వారు కాంగ్రెస్ పై దుష్ప్రచారం.. బీజేపీపై ఖర్గే  సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (CWC meeting) ముగిసింది. ఈ సమావేశంలో నేతలను ఉద్దేశించి పార్టీ చీఫ్ ఖర్గే (Mallikarjuna Kharge) ప్రసగించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాసమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అధికార బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. మత మత విభజన సృష్టిస్తూ ప్రజాసమస్యల నుంచి దృష్టి మళ్ళిస్తున్నారన్నారు. అనేక మంది జాతీయ నాయకులకు సంబంధించి దేశంలో కుట్ర జరుగుతోందని జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరినొకరు వ్యతిరేకించారని చూపించడానికి ప్రణాళికబద్ధంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నెహ్రూకు పటేల్ పట్ల అపారమైన గౌరవం ఉండేదని ఏదైనా సలహా తీసుకోవలసి వస్తే నెహ్రూ స్వయంగా పటేల్ ఇంటికి వెళ్ళేవారు. పటేల్ సౌలభ్యం కోసం సీడబ్ల్యూసీ సమావేశాలు ఆయన నివాసంలో జరిగేవని గుర్తు చేశారు. రేపు ఏఐసీసీ (AICC) విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

ఆర్ఎస్ఎస్ పై..

140 సంవత్సరాలుగా దేశానికి సేవ చేసి పోరాడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ (Congress) పార్టీకి వ్యతిరేక వాతావరణం సృష్టిస్తున్నారని తమ విజయాలుగా చూపించడానికి ఏమీ లేని వ్యక్తులు స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేనటువంటి వారు ఈ పని చేస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు. పటేల్ ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకం అని ఆ సంస్థను ఆయన నిషేధించారని గుర్తు చేశారు. కానీ ఇవాళ ఆ సంస్థలోని వ్యక్తులు సర్దార్ పటేల్ వారసత్వాన్ని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్‌ను రాజ్యాంగ సభలో సభ్యుడిగా చేయడంలో గాంధీజీ, సర్దార్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తివేయడం ద్వారా ఆ మహనీయులను నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రభుత్వం అవమానించిందని ధ్వజమెత్తారు. అంబేద్కర్ నామజపం పేరుతో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పార్లమెంట్ లో అమిత్ షా బాబా సాహెబ్‌ను ఎగతాళి చేశారని కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసన్నారు.

Next Story