మాజీ CM రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఖర్గే

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-04 07:06:09  IST  )

హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య(Konijeti Rosaiah) విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఆవిష్కరించారు.

మాజీ CM రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఖర్గే
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య(Konijeti Rosaiah) విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఆవిష్కరించారు. ఈ కార్య్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

కాగా, దివంగత కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. లక్డీకాపూల్‌లోని మెట్రో స్టేషన్‌ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల ఎత్తు, 450 కిలోల బరువుతో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఇవాళ రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థికశాఖ మంత్రి హోదాలో రోశయ్య బడ్జెట్ ప్రవేశపెట్టిన సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

Next Story