మాజీ మంత్రి మల్లారెడ్డి న్యూ లుక్.. డీజే టిల్లును మించిన స్టైల్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-11 07:56:23  IST  )

బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) జపాన్ పర్యటనలో చిల్ అవుతున్నారు. రోజుకో ప్రాంతంలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి న్యూ లుక్.. డీజే టిల్లును మించిన స్టైల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) జపాన్ పర్యటనలో చిల్ అవుతున్నారు. రోజుకో ప్రాంతంలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మల్లారెడ్డి న్యూ్ లుక్‌(Mallareddy New Look)లో దర్శనమిచ్చారు. జపాన్ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. అది గమనించిన నెటిజన్లు డీజే టిల్లు కంటే డ్రెస్సింగ్ స్టైలే బావుంది సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతకుముందు.. జపాన్‌ బుల్లెట్ ట్రైన్ ఎక్కారు. స్కై ట్రీని విజిట్ చేశారు. స్థానిక ప్రజలతోనూ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. కాగా, ఆ ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ప్రస్తుతం మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకొచ్చినా’ వంటి డైలాగ్స్‌‌తో పాటు డీజే టిల్లు సినిమా పాటలకు వేసిన డాన్స్ వీడియోలతో మల్లారెడ్డికి సోషల్ మీడియాలో యమ ఫాలోయింగ్ పెరిగింది.

Next Story