జపాన్ ‘బుల్లెట్‌’లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఫొటో వైరల్

by Gantepaka Srikanth |

తెలుగు రాజకీయాలను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

జపాన్ ‘బుల్లెట్‌’లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాజకీయాలను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రాజకీయాలే కాకుండా ఆయనలోని పత్యేకమైన డాన్సింగ్, సింగింగ్ టాలెంట్‌ను బయటపెట్టి తెగ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతుంటుంది. ప్రస్తుతం మల్లారెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి జపాన్‌(Japan)కు వెళ్లిన మల్లారెడ్డి.. అక్కడి నగరాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్కడి అందాలను ఆశ్వాదిస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా జపాన్‌ బుల్లెట్ ట్రైన్ ఎక్కారు. ఎక్కడానికి ముందు ట్రైన్ ఎదుట ఫొటోలకు ఫోజులిచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అంతేకాదు.. స్కై ట్రీ దగ్గర కూడా ఫొటోలు దిగారు. స్థానిక ప్రజలతోనూ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. కాగా, ఆ ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




Next Story