- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గన్‌మెన్లు లేకుండా ఒంటరిగా ఆస్పత్రికి Minister Mallareddy
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడుల వ్యవహారంలో బుధవారం రాత్రి తనిఖీలు ముగిశాక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడుల వ్యవహారంలో బుధవారం రాత్రి తనిఖీలు ముగిశాక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోదాల్లో భాగంగా అధికారులు సీజ్ చేసిన లాప్ టాప్‌లను మంత్రి మల్లారెడ్డి అభిమానులు అధికారుల నుంచి లాక్కొని బీభత్సం సృష్టించారు. అనంతరం తన కుమారుడి చేత బలవంతంగా అధికారులు సంతకం చేయించుకున్నారన్న న్యూస్ తెలిసి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హుటాహుటిన అర్ధరాత్రి గన్‌మెన్లు లేకుండా కేవలం డ్రైవర్ సాయంతో మంత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు అధికారుల నుంచి లాప్‌టాప్ లాక్కున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోదాల పేరిట వీరంగం సృష్టించారని ఐటీ అధికారులపై బోయిన్‌పల్లి పీఎస్‌లో మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పీఎస్ ఎదుట ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సీఆర్‌పీఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.






