కేసీఆర్ ఆరోగ్యం పర్‌ఫెక్ట్.. ఇద్దరం కలిసి టిఫిన్ చేశాం: మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

కేసీఆర్ ఆరోగ్యం పర్‌ఫెక్ట్.. ఇద్దరం కలిసి టిఫిన్ చేశాం: మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో సోమాజీగూడలోని (Yashoda Hospital) యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన (KCR Health Condition) ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Chamakura Malla Reddy) స్పందించారు. శుక్రవారం ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలో ఉన్న కేసీఆర్‌ను మల్లారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొద్దిగా వీక్ నెస్ తప్పితే కేసీఆర్ ఆరోగ్యం పర్ ఫెక్ట్ గానే ఉందని అన్నారు. రోటీన్ చెకప్ కోసమే కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. తను ఉదయం పది గంటలకు కేసీఆర్‌ను కలిసినట్లు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఉల్లాసంగా మాట్లాడారు.. ఇద్దరం కలిసి టిఫిన్ చేశామని మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, ‘కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గురువారం సాయంత్రం ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. ఆయన బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి రెండు రోజులు ఆస్పత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కేసీఆర్ ఆరోగ్యం సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ శుక్రవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు.

Next Story