TG: టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య విజయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-03 15:52:25  IST  )

ఆదిలాబాద్-నిజామాబాద్- కరీంనగర్-మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక(Teachers MLC Elections)ల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య(Malka Komaraiah) ఘన విజయం సాధించారు.

TG: టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్-నిజామాబాద్- కరీంనగర్-మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక(Teachers MLC Elections)ల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య(Malka Komaraiah) ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. కాసేపట్లో విజేతను అధికారికంగా ప్రకటించనున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్యకు తెలంగాణ గవర్నమెంట్‌ ఆల్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, టీయూటీఎఫ్‌ మద్దతు పలికాయి. కొమురయ్య గెలుపునకు తీవ్రంగా కృషిచేశాయి. మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు పోలయ్యాయి.

మరోవైపు.. నల్లగొండ - ఖమ్మం - వరంగల్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక(Teachers MLC Elections)ల్లో పీఆర్‌టీయూ(PRTU) అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి(Sripal Reddy) ఘన విజయం సాధించారు. యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. కాసేపట్లో ఈ విజేతను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి చివరి వరకూ పోటీ ఇచ్చారు. నర్సిరెడ్డి తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్‌, మరో స్వతంత్ర అభ్యర్థి పూలరవీందర్‌ ఉన్నారు. ఇక ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి సరోత్తమ్‌రెడ్డి నిలిచారు.

Next Story