HYD: హైదరాబాద్‌లో ప్రముఖ నటిపై దాడి.. ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు

by Ramesh Naini |

ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ మలయాళ నటి సజినిపై హైదరాబాద్‌లో దాడి జరిగింది.

HYD: హైదరాబాద్‌లో ప్రముఖ నటిపై దాడి.. ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ మలయాళ నటి సజినిపై హైదరాబాద్‌లో దాడి జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆస్తి వివాదంలో కొందరు తనపై దాడి చేశారని, ఏ క్షణమైనా తనను చంపేసే ప్రమాదం ఉందని ఆమె ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. ‘నాకు తీవ్ర ప్రాణహాని ఉంది.. దయచేసి నన్ను రక్షించండి’ అని పోలీసులను వేడుకున్నారు. సజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

సజిని సినీ నేపథ్యం..

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సజిని.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 2000వ దశకం ప్రారంభంలో ప్రముఖ నటి షకీలాతో కలిసి పలు బీ గ్రేడ్, సాఫ్ట్ కోర్ సినిమాల్లో గ్లామరస్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ఆస్తి వివాదాల కారణంగా ఒక నటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, తనకు ప్రాణహాని ఉందంటూ రక్షణ కోరడం ప్రస్తుతం సినీ వర్గాల్లో, స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడికి పాల్పడినదెవరు? ఆస్తుల వివాదం ఎవరితో నడుస్తోంది? అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story