Gaddam Vivek : డిసెంబర్ 1న మాలల సింహగర్జన సభ

by Muthe.Rajitha |

డిసెంబర్ 1న హైదరాబాద్ లో మాలల సింహగర్జన సభ(Malala Simhagarjana Sabha)ను నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే గడ్డం(Gaddam Vivek) వివేక్ తెలియజేశారు.

Gaddam Vivek : డిసెంబర్ 1న మాలల సింహగర్జన సభ
X

దిశ, వెబ్ డెస్క్ : డిసెంబర్ 1న హైదరాబాద్ లో మాలల సింహగర్జన సభ(Malala Simhagarjana Sabha)ను నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే గడ్డం(Gaddam Vivek) వివేక్ తెలియజేశారు. శుక్రవారం సభకు సంబంధించిన వివరాలను వివేక్ మీడియాకు వెల్లడించారు. మాలల గుర్తింపు కోసమే జాతిని ఏకం చేస్తున్నామని.. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలున్నారని, మాలల హక్కుల కోసం వీరంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు ప్రభుత్వ ఉద్యోగాలను దోచుకుంటున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆర్టికల్ 341(Article 341) ప్రకారం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. ఈ సభ ఎవరికీ వ్యతిరేకం కాదని.. కేవలం ఇది మాలల ఆత్మగౌరవం కోసం జరుపుతున్న సభ అని వివేక్ వెల్లడించారు.

Next Story