- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
sevalal maharaj: సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించండి.. కేంద్రానికి టీ బీజేపీ ఎంపీల విజ్ఞప్తి
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సంత్ సేవాలాల్ మహారాజ్ (sant sevalal maharaj) జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు (Telangana BJP MPs) కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) ను కోరారు. ఇవాళ కేంద్ర మంత్రిని ఎంపీలు డీకే అరుణ (DK Aruna), రఘునందన్ రావు (Raghunandan Rao), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారాలు ఉన్నారని, బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయింతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. ఈ అంశంలో అవసరం అయితే అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలిశామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీన సంత్ సేవాలాల్ జయంతి ఉన్నది. ఆలోపు సాధ్యం కాకపోతే ఆ తర్వాతనైనా వీలైనంత త్వరగా ఆదేశాలు వచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.






