Bandi Sanjay : మీ అభివృద్ధికి బీజేపీనే గెలిపించండి : బండి సంజయ్

by Y. Venkata Narasimha Reddy |

బీసీ(BC)ల కోసం నిజంగా పోరాడేది బీజేపీ(BJP) మాత్రమేనని..అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది కూడా బీజేపీనే అని..బీసీల అభివృద్ధిని అనుక్షణం కాంక్షించే బీజేపీ అభ్యర్థులనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండని కేంద్ర మంత్రి బండి సంజయ్ Bandi Sanjayపిలుపునిచ్చారు.

Bandi Sanjay : మీ అభివృద్ధికి బీజేపీనే గెలిపించండి : బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: బీసీ(BC)ల కోసం నిజంగా పోరాడేది బీజేపీ(BJP) మాత్రమేనని..అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది కూడా బీజేపీనే అని..బీసీల అభివృద్ధిని అనుక్షణం కాంక్షించే బీజేపీ అభ్యర్థులనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండని కేంద్ర మంత్రి బండి సంజయ్ Bandi Sanjayపిలుపునిచ్చారు. కరీంనగర్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఈరోజు "బీసీలు బీసీలు" అని హంగామా చేస్తున్న పార్టీలు కేవలం ఓట్ల కోసం చేస్తున్న కొంగ జపమే! అని విమర్శించారు.

లేకపోతే కులగణనలో ముస్లింలను బీసీల్లో చేర్చినప్పుడు కాంగ్రెస్ మీద ఆ పార్టీలు, ఆ పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎందుకు నోరు మెదపలేదని ? అది ఆ వర్గం ఓట్ల కోసం చేస్తున్న బుజ్జగింపు రాజకీయం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అందుకే అలాంటి వారికి ఓట్లు వేస్తే కాంగ్రెస్ కు వేసినట్టేనని.. వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించరని..ఒకవేళ వాళ్ళు గెలిచినా, వారు చేరేది కాంగ్రెస్ పార్టీలోనేనని..బీసీలు ఆలోచించాలని బండి సంజయ్ కోరారు. 10శాతం ముస్లింలను బీసీలలో కలిపితే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటువంటి వారిని ఓడించాలని కోరారు.

ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అంజిరెడ్డి, కొమురయ్యలను మీరు గెలిపిస్తే మీ పక్షాన నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వంపై లడాయికి దిగుతామన్నారు. ఫలితాలొచ్చిన వారం రోజుల్లోపే నిరుద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై దీక్షలు పోరాటాలు చేసైనా పాలకుల మెడలు వంచుతామని..మీ సమస్యలని ప్రస్తావిస్తం, పరిష్కార మార్గం పట్టిస్తామని బండి సంజయ్ కోరారు.

Next Story