- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. ఛార్జ్‌షీటులోకి ఆ ముగ్గురు బీఆర్ఎస్ నేతల పేర్లు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరూ ఊహించని మలుపు తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణను స్పీడప్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), తాజాగా నిందితుల జాబితాలోకి మరో ముగ్గురు కీలక బీఆర్ఎస్ ముఖ్య నాయకుల పేర్లను చేర్చినట్లుగా తెలుస్తోంది. అయితే, గత కొంతకాలంగా సాగుతున్న విచారణ ఇటీవలే ముగింపు దశకు వచ్చినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా సిట్ అధికారులు సిద్ధం చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీటులో ముగ్గురు కీలక నేతల పేర్లను నిందితులుగా చేర్చినట్లుగా తెలుస్తోంది.
లీగల్ ఒపీనియన్‌కు మొగ్గు..
హై ప్రొఫైల్ కేసు కావడంతో సిట్ అధికారులు ప్రతి అడుగూ ఆచితూచి వేస్తున్నారు. సప్లిమెంటరీ ఛార్జ్‌షీటు (Supplementary charge sheet)లో నేతల పేర్లను చేర్చిన అనంతరం, న్యాయనిపుణుల ఆమోదం (Legal Opinion) కోసం అధికారులు పంపినట్లుగా తెలుస్తోంది. లీగల్ టీమ్ నుంచి అనుమతి లభించిన వెంటనే, వీరిపై అధికారికంగా అభియోగాలు నమోదు చేయడానికి అవసరమైన అనుమతులను సిట్ ప్రభుత్వం నుంచి తీసుకోనుంది. కాగా, ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారుల అరెస్టులు, విచారణలతో వేడెక్కిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. ఇప్పుడు నేరుగా రాజకీయ ప్రముఖుల పేర్లు నిందితుల జాబితాలోకి రావడం స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే, ఆ ముగ్గురు ముఖ్య నేతలు ఎవరనేది అధికారికంగా వెల్లడైతే ఈ కేసు బిగ్ టర్న్ తీసుకునే చాన్స్ ఉంది.






